Ram Charan-Upasana to Welcome Twins: మెగా ఫ్యామిలీ లో డబుల్ ఆనందం.. కవలలకు జన్మనివ్వనున్న రామ్ చరణ్-ఉపాసన!

Ram Charan-Upasana to Welcome Twins: మెగా ఫ్యామిలీలో డబుల్ ఆనందాలు వెల్లివిరిశాయి. హీరో రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారు. దీపావళి పండగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఘనంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఉపాసనకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. రామ్ చరణ్-ఉపాసన జంట 2012 జూన్ 14న వివాహం చేసుకోగా, 2023 జూన్‌లో తొలి సంతానంగా క్లీంకార పాప పుట్టిన విషయం తెలిసిందే.

Ram Charan-Upasana to Welcome Twins
Ram Charan-Upasana to Welcome Twins

కవలలతో రెండింతల సంతోషం: ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందం రాబోతోంది. ఉపాసన తాజాగా తన సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ, “ఈ దీపావళి డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ తెచ్చింది” అంటూ పేర్కొన్నారు. ఆమె చెప్పిన “డబుల్” అన్న మాట వెనక అర్థం పెద్దదే. ఈసారి ఉపాసన కవలలకు జన్మనివ్వబోతున్నారు. అంటే రామ్ చరణ్-ఉపాసన దంపతుల ఇంట మరోసారి రెండింతల సంతోషం రాబోతోంది.


చిరంజీవి కుటుంబం - మనవరాళ్లతో నిండిన ఇల్లు: చిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం - రామ్ చరణ్, సుస్మిత, శ్రీజ. సుష్మితకు విష్ణు ప్రసాద్‌తో వివాహం కాగా, వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్‌ను వివాహం చేసుకుని, నివృతి అనే కూతురుకు జన్మనిచ్చారు. తరువాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం శ్రీజ కల్యాణ్ దేవ్‌ను వివాహం చేసుకోగా, వీరికి నవిష్క అనే కూతురు పుట్టింది. ఆ తరువాత వీరి మధ్య కూడా విభేదాలు రావడంతో విడిపోయారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు క్లీంకార పాప జన్మించింది. ఈ విధంగా ప్రస్తుతం చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు.

Mega family happy celebrations
Mega family Happy Celebrations

చిరంజీవి కోరిక నెరవేరుతుందా?
ఒకసారి ఓ ఈవెంట్‌లో చిరంజీవి సరదాగా మాట్లాడుతూ, “ఇంట్లో లేడీస్ హాస్టల్ వార్డెన్లా అనిపిస్తోంది. చుట్టూ ఆడపిల్లలే ఉన్నారు, ఒక్క మగపిల్లాడూ లేదు. చరణ్ ఈసారి అయినా అబ్బాయిని కనాలి. నా వారసత్వం ముందుకు సాగాలని ఉంది. కానీ మళ్లీ అమ్మాయే పుడుతుందేమోనని భయం వేస్తోంది” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. చాలామంది “అబ్బాయి పుట్టాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ అమ్మాయి పుడుతుందేమోనని భయపడటం సరికాదు” అని స్పందించారు.

ఇప్పుడు ఉపాసన కవలలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో, ఈసారి చిరంజీవి కోరిక నెరవేరుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మెగా ఫ్యామిలీలో డబుల్ సంతోషం వెల్లివిరుస్తుండగా, అందరి చూపులు రామ్ చరణ్-ఉపాసన దంపతుల మీదే ఉన్నాయి.

Post a Comment (0)
Previous Post Next Post